రైతులపై కేంద్రానికి గౌరవం లేదు… హేళనగా చూస్తున్నారు: మంత్రి నిరంజన్ రెడ్డి

-

రైతులపై కేంద్రానికి గౌరవం లేదని.. హేళనగా చూస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. ఈరోజు కేంద్ర మంత్రి పియూష్ గోయల్ తో సమావేశం అయిన తర్వాత కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ధాన్యం సేకరించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని… కానీ తెలంగాణపై కేంద్రం పెద్దల తీరు దారుణంగా ఉందని ఆయన అన్నారు. కేంద్రం మభ్యపెట్టి మాట్లాడుతోందని నిరంజన్ రెడ్డి విమర్శించారు. ధాన్యం సేకరణ రాజ్యాంగ పరంగా కేంద్రం ప్రభుత్వం మీద ఉండే విధి అని… రైతులు, ప్రజల అవసరాలకు పోగా.. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. ఇది కేంద్ర ప్రభుత్వం బాధ్యత అని అన్నారు. ‘ రా’ రైస్ తీసుకుంటామని చెబుతున్నారని ఆయన అన్నారు. పంజాబ్ లో తీసుకున్నట్లు తీసుకోవాలని కోరితే.. తీసుకుంటామని కాదన్నామని అని అంటున్నారు… అయితే పంజాబ్ లో కేవలం వానాకాలంలో మాత్రమే వరి పండుతోందని, యాసంగిలో గోధుమలు పండుతాయని ఇది దేశంలో అందరికి తెలిసిందే అని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో యాసంగిలో వచ్చే వడ్లను తీసుకోవాలని… వాటికి డబ్బులు కట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news