డ్రగ్స్ కేసులో ఎన్టీఆర్ కుటుంబం..? వెలుగులో కి షాకింగ్ నిజాలు..

-

బంజారాహిల్స్ లోని ఫుడింగ్ & మింక్ పబ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. డ్రగ్స్ కేసు నిందితులను ఐదు రోజుల కస్టడీకి నాంపల్లి కోర్టులో బంజారాహిల్స్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. హైదరాబాద్ డ్రగ్స్ సరఫరా పై పూర్తిగా ని గా ఉందని నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ చీఫ్ చక్రవర్తి తెలిపారు. డ్రగ్స్ వినియోగం పై సమాచారం ఉందన్నారు. పబ్ లు, క్లబ్ లు, రెస్టారెంట్, రిసార్ట్స్ పై పూర్తి ఉంచామన్నారు. గోవా నుంచి డ్రగ్స్ రవాణా అవుతున్నట్టు గుర్తించామని తెలిపారు. డార్క్ నెట్ ద్వారా విదేశాల నుంచి డ్రగ్స్ రవాణా అవుతుంది అన్నారు.డార్క్ నెట్ ని డీకోడ్ చేసే టెక్నాలజీ తమ వద్ద ఉందన్నారు. డ్రెస్ ప్లేడ్లర్స్, వినియోగదారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పిల్లల ప్రవర్తన పై తల్లిదండ్రులు నిఘా ఉంచాలని ఆయన సూచించారు.

 

ఐతే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బంజారాహిల్స్ డ్రగ్స్ కేసు కీలక మలుపు తిరిగింది.నిబంధనలకు విరుద్ధంగా పబ్బు పార్టీకి మైనర్ లనునిబంధనలకు విరుద్ధంగా పబ్ పార్టీకి మైనర్ లను యాజమాన్యం అనుమతించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో అభిషేక్, అనిల్ ను అరెస్టు చేయగా, అర్జున్ కిరణ్ రాజ్ పరారీలో ఉన్నారు. ఈ కేసులో ఏ 1 అనిల్, ఏ 2 అభిషేక్, ఏ 3 గా ఎన్టీఆర్ కూతురి అల్లుడు అర్జున్ వీరమాచనేని, ఏ 4 నిందితుడిగా మాజీ ఎంపీ రేణుకా చౌదరి అల్లుడు కిరణ్ రాజ్ ను పోలీసులు చేర్చారు. 2017 – 20 వరకు తన భార్యతో కలిసి కిరణ్ రాజ్ పబ్ నడిపాడు. 2020 ఆగస్టు లో అభిషేక్, అనిల్ కి లీజుకు ఇచ్చిన కిరణ్ రాజ్ పార్ట్నర్ గా కొనసాగుతున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version