విపక్షాలకు ముందస్తు ఎన్నికల జ్వరం పట్టుకుందన్నారు బిజెపి రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముందస్తుకు వెళ్లే ఆలోచన లేదన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు బిజెపి సిద్ధంగా ఉందన్నారు. దేశంలో ఇండియా కూటమి ప్రభావం పెద్దగా ఉండదన్నారు. వన్ నేషన్.. వన్ ఎలక్షన్ ని ప్రధాని మోదీ ప్రతిపాదించారని తెలిపారు.
జెమిలి ఎన్నికలతో ప్రజాధనం, సమయం వృధా కాదన్నారు. అంతేకాదు జమిలి ఎన్నికలకు చాలా పార్టీలు సానుకూలంగా ఉన్నాయని తెలిపారు. దేశ ప్రజల హితం కోసమే ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల మేలుకోరే గ్యాస్ ధరలు తగ్గిస్తున్నట్లు తెలిపారు. ఇక జెమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో 16 మందితో కూడిన సభ్యుల కమిటీని కేంద్రం నియమించింది.