రేవంత్ రెడ్డి బలమైన నేత – పవన్‌ కళ్యాణ్‌

-

రేవంత్ రెడ్డి బలమైన నేత అన్నారు డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌. అల్లు అర్జున్ స్థానంలో రేవంత్ ఉన్నా అలానే అరెస్టు చేస్తారు, చట్టం ఎవరికి చుట్టం కాదన్నారు. రేవంత్ రెడ్డి తెలుగు పరిశ్రమకు అన్ని రకాలుగా సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చారు అని అల్లు అర్జున్‌ ఇష్యూపై డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ స్పందించారు. సంధ్య థియేటర్ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Pawan Kalyan praises Revanth’s reign

గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చారు… అభిమాని మృతి చెందిన తర్వాత వెంటనే వాళ్ల ఇంటికి వెళ్లి పరామర్శించాలని చురకలు అంటించారు. మానవతా దృక్పథం లోపించినట్లైందని ఆగ్రహించారు పవన్ కళ్యాణ్. బాధిత కుటుంబం ఇంటికి ఎవరో ఒకరు ఆ రెండో రోజే వెళ్ళి చెప్పి మాట్లాడి మేం తోడున్నాం అని చెపితే ఇంత జరిగేది కాదన్నారు. బాధిత కుటుంబాన్ని వెంటనే పరామర్శించాల్సిందని తెలిపారు. ఎవరైనా కనిపిస్తే చెయ్యి ఊపాలని, అభివాదం చేయాలి అనే ఆలోచన ప్రతీ హీరోకి ఉంటుందని వివరించారు. సారీ అని చెప్పడానికి పలు విధానాలు ఉంటాయన్నారు. ఈ సమస్యలో హీరోని ఒంటరిని చేసేసారు… ఎవరి విషయంలో అయినా రేవంత్ రెడ్డి విధానం అదే అన్నారు. ఆ సినిమా విషయంలో రేవంత్ రెడ్డి చాలా ప్రోత్సాహం ఇచ్చారు… టికెట్ రేట్లు పెంచడానికి, షో లకి కూడా అనుమతులిచ్చారన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version