Telangana : ఇవాళ్టి నుంచి ప్రజావాణి పునః ప్రారంభం

-

Telangana : ఇవాళ్టి నుంచి ప్రజావాణి పునః ప్రారంభం కానుంది. తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి.. నేటి నుంచి పునః ప్రారంభం కానుంది. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 10:30 గంటలకు అన్ని కలెక్టరేట్లలోని సమావేశ మందిరంలో నిర్వహించనున్నారు అధికారులు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.

Prajavani will resume from today

కాగా, తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ ఇకపై డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ప్రాంగణంలోకి రానున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ప్రగతి భవన్ సీఎం క్యాంపు కార్యాలయంగా కొనసాగింది. దీనిని తాజా గా ప్రభుత్వం జ్యోతిబాపూలే ప్రజా భవన్ గా మార్చడంతో సీఎం క్యాంపు కార్యాలయం మరో చోటుకు షిప్ట్ కావా ల్సి వచ్చింది. దీనికి అనుగుణంగా ఎంసీఆర్ హెచ్ఆర్ డీ ప్రాంగణంలో గట్టుమీద ఉన్న బ్లాక్ లోకి మార్చే ఆలోచనలు తెరమీదకు వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version