శాసన వ్యవస్థ సచివాలయ సలహాదారుగా ప్రసన్నకుమార్‌

-

రాష్ట్ర శాసనసభ, శాసనమండలి వ్యవస్థ సచివాలయ సలహాదారుగా సూర్యదేవర ప్రసన్న కుమార్‌ నియమితులయ్యారు. ఈ మేరకు శానససభ కార్యదర్శి డాక్టర్‌ వి. నరసింహాచార్యులు  ఉత్తర్వులు జారీ చేశారు.  శాసనవ్యవస్థ సచివాలయం  పనితీరు మరింత సమర్థంగా ఉండేలా ప్రభుత్వ ప్రతిపాదనల మేరకు ఈ నియామకం చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రసన్నకుమార్‌ కేంద్ర ప్రభుత్వంలో సుమారు 30 ఏళ్లపాటు విభిన్న హోదాల్లో సేవలందించారు. ఖమ్మం జిల్లాకు చెందిన ప్రసన్నకుమార్‌ దిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం నుంచి పర్యావరణ శాస్త్రంలో ఎమ్మెస్సీ, ఎంఫిల్‌ డిగ్రీలు, దిల్లీ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో  డిగ్రీ పొందారు.

గతంలో ఐదేళ్లపాటు లోక్‌సభ స్పీకర్‌కు ఓఎస్టీగా పని చేశారు ప్రసన్న. భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ కార్యాలయంలో జాయింట్‌ డైరెక్టర్‌, డైరెక్టర్‌గా ఆరేళ్లకుపైగా సేవలందించారు. దాదాపు మూడేళ్లపాటు దిల్లీ శాసనసభ కార్యదర్శిగా  పనిచేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి కార్యాలయంలో ఓఎస్టీగా, సుప్రీంకోర్టులో రిజిస్ట్రార్‌గా కూడా కొంతకాలం విధులు నిర్వర్తించారు. లోక్‌సభ టీవీ ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. రాజ్యసభ టీవీ వ్యవస్థాపకుల్లో ఒకరిగా  గుర్తింపు పొందారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version