దళిత బంధు ఇవ్వకపోతే రాస్తారోకోలు నిర్వహిస్తాం : పుట్ట మధుకర్

-

జయశంకర్ భూపాలపల్లి జిల్లా.. కాటారం మండల కేంద్రంలో దళిత బంధు ధర్మాయుద్ధం సభ నిర్వహించారు. అయితే ఈ సభకు ముఖ్య అతిథిగా పాల్గోన్న మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ కీలక కామెంట్స్ చేసారు. రెండవ విడత దళిత బంధు నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేసారు. ఈ క్రమంలో భారీగా ర్యాలీ నిర్వహించారు లబ్ధిదారులు. ఇందులో మంథని నియోజకవర్గ పరిధిలోని దళిత బంధు లబ్ధిదారులు పాల్గొన్నారు.

అయితే దళితుల బంధు పథకం నిధులను నిలిపివేసి దళితులకు తీవ్ర అన్యాయం చేసి.. దళితులకు ద్రోహం చేశారని ఆరోపించారు దళిత బంధు లబ్ధిదారులు. ఇక గత ప్రభుత్వం దళిత బంధు పథకం ద్వారా మంజూరి అయినా లబ్ధిదారులకు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకోవడం జరిగిందన్నారు పుట్ట మధు. నిధులు నిలిపివేసి దళితులను మభ్యపెడుతున్నారు అని పేర్కొన్నారు. అలాగే నిధులు విడుదల చేయాలని కోరుతూ దళితుల నుంచి వచ్చిన అర్జీలను నాయకులు, అధికారులు పట్టించుకోవడం లేదు. అయితే తొందరగా దళిత బంధు నిధులు మంజూరి చేయాలనీ.. లేకుంటే ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామన్నారు మధుకర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version