దేశ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మేదావి పీవీ : సీఎం రేవంత్ రెడ్డి

-

మాజీ ప్రధాని మంత్రి పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లోని పీవీ జ్ఞానభూమి వద్ద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు గవర్నర్ తమిలిసై సౌందరరాజన్ నివాళులు ఘటించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధానిగా ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. దేశం కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి పీవీ నరసింహారావు అని అన్నారు.

పరిపాలనలో సమూల మార్పులు తెచ్చి ఆదర్శంగా నిలిచి వ్యక్తి పీవీ. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రశ్నార్థకంగా మారినప్పుడు సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు అని ఆయన చెప్పారు. బంగారాన్ని కుదువ పెట్టి అప్పులు తేవడంపై ఆయన ఒకే మాట చెప్పారు. తెలివైనవాడు సగం ఆస్తిని కుదవ పెట్టి అయినా సరే మిగతా ఆస్తిని కాపాడుకుంటారని పీవీ చెప్పారనే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. భూమిని పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చిన వ్యక్తి పీవీ నరసింహారావు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

పేదలకు భూములు పంచడానికి పీవీ బలమైన పునాదులు వేశారు. పీవీ మన మధ్య లేకపోయినా వారి సంస్కరణలు సదా ఆచరణీయం. పీవీ షూట్, జైపాల్ రెడ్డి షూట్ లను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అని ఆయన చెప్పుకొచ్చారు. వీరిద్దరూ తెలంగాణకు లంకె బిందెల్లాంటి వారు. పీవీ కీర్తిని పెంచేలా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుంది అని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version