సెప్టెంబర్ 17 న సిరిసిల్లకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రానున్నారు. సెప్టెంబర్ 17 న సిరిసిల్లలో “విద్యార్ధి యువజన డిక్లరేషన్” విడుదల చేయనున్నారు రాహుల్ గాంధీ. కేసి వేణుగోపాల్ నివాసంలో కొనసాగుతున్న కీలక సమావేశం జరిగింది. తెలంగాణలో పార్టీ పరిస్థితుల పై రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సి.ఎల్.పి నాయకుడు భట్టి విక్రమార్క చర్చలు జరిపారు. అంతర్గత విభేదాలు, సమన్వయ లోపాలు, నేతలు ఏకపక్షంగా వ్యవహారిస్తున్న తీరు పై చర్చ జరిగింది.
విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ రాక సందర్బంగా హనుమంతరావు వ్యవహరించిన తీరు, జగ్గారెడ్డి వ్యాఖ్యలు తదితర అంశాలపై చర్చ జరిగింది. తెలంగాణ లో పార్టీ కార్యక్రమాలు, చేరికలు రాహుల్ పర్యటన ఖరారు పై నేతలు చర్చిస్తున్నట్లు సమాచారం అందుతోంది.
తెలంగాణ లో పలు పార్టీ లకు చెందిన ముఖ్య నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో వారి మద్దతుదారులు కాంగ్రెస్‌లో చేరేందుకు కార్యాచరణ సిధ్దం చేసినట్లు సమాచారం. విడతల వారీగా చేరికలు ఉండేలా కార్యాచరణ సిధ్దం చేయనున్నారు. ఇందులో భాగంగానే సెప్టెంబర్ లో మరోసారి రాష్ట్రానికి రాహుల్ గాంధీ రానున్నారు.