BIG BREAKING: విద్యార్థులకు అలర్ట్…ఇవాళ స్కూళ్లకు సెలవు

-

BIG BREAKING: తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు అలర్ట్…ఇవాళ స్కూళ్లకు సెలవు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారీ వర్షాల నేపథ్యంలో రంగారెడ్డి, GHMC పరిధిలోని స్కూళ్లకు సెలవు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా ఈ తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.

Telangana govt has announced a holiday for school

కాగా, హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న కుండపోత వానతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపైకి వరద చేరి చెరువులను తలపించాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్‌, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఎస్‌ఆర్‌ నగర్‌, దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట, సరూర్‌నగర్‌, ఎల్బీనగర్, నాగోల్, అల్కాపురి, మలక్‌పేట, ఖైరతాబాద్‌, నాగారం, కుత్బుల్లాపూర్‌, మల్కాజిగిరిలో ఎడతెరపి లేని వర్షం కురుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version