చెరువులలో నిర్మించిన విద్యా సంస్థలపై హైడ్రా సంచల నిర్ణయం తీసుకుంది. ముందస్తు గా నోటీసులు ఇచ్చి అక్కడి నుంచి విద్యాసంస్థల్ని తరలించేందుకు అవకాశం ఇస్తామని హైడ్రా ప్రకటించింది. దీనిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ… విద్యార్థుల అకాడమిక్ ఇయర్ నష్టపోకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఓవైసీ, పల్ల, మల్లారెడ్డి సంస్థలకు ముందస్తు నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
చాంద్రాయణగుట్ట సలకం చెరువులోని ఒవైసీకి చెందిన ఫాతిమా కాలేజీపై హైడ్రా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. విద్యాసంస్థల్లో అక్రమ కట్టడాలు తొలగించేందుకు సమయం ఇస్తామన్నారు. విద్యా సంస్థలు కాబట్టి అకడమిక్ ఇయర్ మధ్యలో చర్యలు తీసుకుంటే విద్యార్థులకు నష్టమని చెప్పారు. విద్యార్థులు రోడ్డున పడకూడదని మాత్రమే ఆలోచిస్తున్నాం…వాళ్లకు వాళ్లుగా తొలగించకపోతే చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఒవైసీ అయినా, మల్లారెడ్డి .. పల్ల అయినా అందరికీ ఒకటే రూల్ అన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్.