తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 65 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యే ఓటమి పాలయ్యారు. అదేవిధంగా బీజేపీ కి చెందిన హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా ఓడిపోయాడు. హుజూరాబాద్, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేశాను.. రెండు నియోజకవర్గాల్లో ప్రజలు ఆదరిస్తారని భావించాను.
ప్రజలు తనకు అనుకూలంగా తీర్పు ఇవ్వలేదు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నాను. 20 ఏళ్లుగా హుజూరాబాద్ ప్రజలు వారికి సేవ చేసే భాగ్యాన్ని కలిగించారు. వారి రుణం తీర్చుకోలేనేది. గెలుపొందిన బీజేపీ అభ్యర్థులకు హార్థిక శుభాకాంక్షలు చెప్పారు. ప్రజల సమస్యలను అసెంబ్లీ సాక్షిగా వినిపించాలని కోరుకుంటున్నాను. అధికారం చేపట్టబోతున్న కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలిపారు బీజేపీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు, అభిమానులకు, ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఈటల రాజేందర్. జై తెలంగాణ..! భారత్ మాతాకి జై.. అని ట్విట్టర్ ద్వారా స్పందించారు ఈటల.