నిన్న మంత్రి కేటీఆర్ తన సొంత నియోజక వర్గమైన సిరిసిల్లాలో పర్యటించారు. అయితే.. ఈ పర్యటనలో మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ ఎదురైంది. ఆ పట్టణంలో నిరసన చేస్తున్న వీఆర్‌వోలు మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ని అడ్డుకున్నారు. అయితే.. ఈ సంఘటన పై రేవంత్ రెడ్డి స్పందించారు.
తండ్రి, కొడుకులు జనం మధ్య స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదంటూ ట్వీట్ చేశారు రేవంత రెడ్డి. “ట్విట్టర్ పిట్టకు నిన్న మెట్ పల్లిలో చెరకు రైతులు, నేడు సిరిసిల్లలో వీఆర్ఏల సెగ తగిలింది. కేసీఆర్ కు భద్రాచలంలో వరద బాధితుల నిరసన తెలిసిందే. ఇక తండ్రి కొడుకులు జనం మధ్య స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదు. బంగారు తెలంగాణ క్షేత్రంలో వాస్తవ పరిస్థితి ఇది. ” అంటూ చురకలు అంటించారు మంత్రి కేటీఆర్.
ట్విట్టర్ పిట్టకు నిన్న మెట్ పల్లిలో చెరకు రైతులు, నేడు సిరిసిల్లలో వీఆర్ఏల సెగ తగిలింది. కేసీఆర్ కు భద్రాచలంలో వరద బాధితుల నిరసన తెలిసిందే.
ఇక తండ్రి కొడుకులు జనం మధ్య స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదు. బంగారు తెలంగాణ క్షేత్రంలో వాస్తవ పరిస్థితి ఇది. pic.twitter.com/k5uH9FuZXr
— Revanth Reddy (@revanth_anumula) July 23, 2022