కాంగ్రెస్ కార్యకర్తను దారుణంగా కొట్టిన రేవంత్ రెడ్డి !

-

కాంగ్రెస్‌ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి చాలా యాక్టివ్‌ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. అలాగే.. ఎప్పుడు వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. అటు కోపం వస్తే.. కార్యకర్తల వీపులు వాయిస్తూ ఉంటారు రేవంత్‌ రెడ్డి. ఈ తరుణంలోనే.. రామగుండం సభలో రేవంత్ రెడ్డిని కలవడానికి వెళ్లిన అభిమానిని చితకబాదారు రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌ గా మారింది.

Revanth Reddy brutally beat the Congress worker

ఇది ఇలా ఉండగా…ఇవాళ తిరుమల శ్రీవారిని రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి రాబోయే రోజుల్లో మంచి రోజులు రాబోతున్నాయని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం అంటే నవంబర్ 12న ఉదయం తిరుమల స్వామివారి నైవేద్య విరామ సమయంలో కుటుంబసభ్యులతో కలిసి రేవంత్ రెడ్డి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనమనం అనంతరం ఆలయ రంగనాయకులు మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version