నేడు ఖమ్మంలో కాంగ్రెస్ తలపెట్టిన ‘తెలంగాణ జన గర్జన’ బీఆర్ఎస్ వెన్నులో వణుకుపుట్టిస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు. సభకు వచ్చే అశేష జనవాహినికి ట్రాన్స్ పోర్టు అడ్డంకులు సృష్టించి, సంక్షేమం కట్ చేస్తామని బెదిరించి ప్రభంజనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహించారు రేవంత్ రెడ్డి.
అర చెయ్యిని అడ్డు పెట్టి సూర్య కాంతిని ఆపలేరన్న సత్యాన్ని ప్రభుత్వం గ్రహిస్తే మంచిది. అధికారులు పద్ధతి మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కాగా, ఖమ్మం జిల్లాలో ఇవాళ కాంగ్రెస్ జనగర్జన భారీ బహిరంగ సభ జరగనుంది. అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరవనున్న ఈ సభలో రాహుల్ సమక్షంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హస్తం పార్టీలో చేరనున్నారు.