4 ఏళ్లు ట్రైనింగ్‌ ఇచ్చి పంపిస్తే..యువత తీవ్రవాదులైతే ఏంటి పరిస్థితి ? : రేవంత్‌

-

4 ఏళ్లు ట్రైనింగ్‌ ఇచ్చి పంపిస్తే..ఆ యువత తీవ్రవాదులైతే ఏంటి పరిస్థితి ? దానికి ఎవరు బాధ్యులని రేవంత్‌ రెడ్డి నిలదీశారు. నాలుగేండ్లు శిక్షణ చేసి వచ్చిన వాడికి ఏం పని చేస్తారు.. పిల్లనిచ్చేది ఎవరని నిలదీశారు. మాజీ సైనిక హోదా కూడా ఇవ్వకపోతే ఎట్లా అని… ఆయుధం శిక్షణ పొందిన తర్వాత… తీవ్రవాదం వైపు వెళ్తే బాధ్యులు ఎవరు..? పక్కదారి పడితే దేశం ప్రమాదం లో పడదా..? అని నిలదీశారు.

మోడీ..కెసిఆర్ లు అధికారంలో ఉండటం తో యువకుల జీవితాలు గందర గోళం లోకి నెట్టారని నిప్పులు చెరిగారు. సికింద్రాబాద్ లో ఆందోళన చేస్తే.. జైల్లో పెట్టారని… చనిపోయిన రాకేష్ కి శవ యాత్ర చేశారని టీఆర్‌ఎస్‌ పై మండిపడ్డారు. Trs పా ర్టీ జెండాలు కట్టీ…మంత్రులు శవ యాత్ర కి పోటీ పడ్డారు.. ఆ తర్వాత పట్టించుకోలేదని ఆగ్రహించారు. జైల్లో అరవై మందిని పెడితే పట్టించుకోలేదని.. రాష్ట్రం కూడా కేసులు పెట్టిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news