తెలంగాణ రాష్ట్ర రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది కేసీఆర్ సర్కార్. ఒకేరోజు రైతుల ఖాతాల్లోకి రూ. 3000 కోట్లు ధాన్యం కొనుగోలు డబ్బును విడుదల చేశామని తెలంగాణ రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. మిగిలిన మొత్తాన్ని సైతం 20వ తేదీ కల్లా రైతులకు అందజేస్తామని వెల్లడించారు.
కాగా, ఈ యాసంగి సీజన్ లో నిన్నటి వరకు 64.52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుండి సేకరించామన్నారు. ఆ ధాన్యం విలువ రూ. 13,264 కోట్లు అని పేర్కొన్నారు. ధాన్యం సేకరణ వివరాలు వెల్లడించిన మంత్రి గంగుల కమలాకర్… యాసంగి ధాన్యం సేకరణలో దేశంలోనే నెంబర్ 1 తెలంగాణ అని తెలిపారు. సేకరణ కేంద్రాల మూసివేతపై కలెక్టర్లకే నిర్ణయాధికారం, 18 నాటికి కొనుగోల్లు పూర్తి అయిందని వివరించారు. ఈ నెల 20 వ తేదీ నాటికి మొత్తం డబ్బులు విడుదల చేస్తామని ప్రకటన చేశారు తెలంగాణ రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్.