సీక్రెట్ సర్వే: హస్తంకు అడ్వాంటేజ్ ఎక్కువట!

-

ఇటీవల రాజకీయాల్లో సర్వేల గోల ఎక్కువైపోయింది…ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే..సర్వే సంస్థలు రంగంలోకి దిగేసి ఎప్పటికప్పుడు ప్రజల మూడ్‌ని పసిగట్టే పనిలో ఉంటున్నాయి..అలాగే ఏ పార్టీకి ఆ పార్టీ సొంత సర్వే సంస్థలని పెట్టుకుని సర్వేలు చేయించుకుంటున్న విషయం తెలిసిందే..ఇప్పటికే తెలంగాణలో ఎవరికి వారు సెపరేట్‌గా సర్వేలు చేయించుకుంటున్నారు. ఈ సర్వేలు చేయించుకోవడంలో కేసీఆర్ ముందు ఉంటారని చెప్పొచ్చు..ఎప్పటికప్పుడు తమ పార్టీ గురించి కేసీఆర్ సర్వేలు చేయించుకుంటారనే సంగతి తెలిసిందే.
congress
congress
ఇక టీఆర్ఎస్‌తో ఢీ కొడుతున్న ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు సైతం సొంత సర్వేలు చేసుకుంటున్నాయని తెలిసింది. ఇదే క్రమంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ సీక్రెట్‌గా ఓ సర్వే చేయించుకుందట..అందులో 50 సీట్లలో కాంగ్రెస్‌కు ఎడ్జ్ ఉన్నట్లు తేలిందట. అంటే 119 సీట్లలో కాంగ్రెస్ పార్టీకి 50 సీట్లలో గెలిచే అవకాశాలు ఉన్నాయట. అయితే ఈ సర్వే ఎంతవరకు నిజమనేది కాంగ్రెస్ వాళ్ళకే తెలియాలి.
కాకపోతే ఇప్పుడున్న పరిస్తితుల్లో కాంగ్రెస్‌కు 50 సీట్లలో ఎడ్జ్ ఉంటుందా? అంటే ఉండే అవకాశాలు లేకపోలేదనే చెప్పాలి. ఎందుకంటే గత రెండు ఎన్నికల్లో ఓడిపోయి అధికారానికి దూరమైంది…ఇక ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ కష్టపడుతుంది. అదే సమయంలో రెండు సార్లు గెలిచిన టీఆర్ఎస్‌పై ఆటోమేటిక్‌గా వ్యతిరేకత కనిపిస్తోంది…ఇప్పటికే 40 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వచ్చినట్లు..టీఆర్ఎస్ చేసుకున్న సొంత సర్వేలోనే తేలిందని ఆ మధ్య కథనాలు వచ్చిన విషయం తెలిసిందే.
అలా టీఆర్ఎస్‌కు వ్యతిరేకత వచ్చిన స్థానాల్లో కాంగ్రెస్‌ ఎడ్జ్‌లోకి వచ్చిందని తెలుస్తోంది..అయితే తెలంగాణలో బీజేపీ కూడా దూకుడుగా రాజకీయం చేస్తుంది..కాకపోతే ఆ పార్టీకి రాష్ట్ర స్థాయిలో పూర్తి బలం కనబడటం లేదు..పైకి ఏదో బలంగా ఉన్న..టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మాదిరిగా బీజేపీకి క్షేత్ర స్థాయిలో బలం మాత్రం కనిపించడం లేదు. అయితే కాంగ్రెస్ చేసిన సర్వే నిజమైతే…వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌-కాంగ్రెస్‌ల మధ్యే ప్రధాన ఫైట్ ఉంటుంది. చూడాలి మరి కాంగ్రెస్ పరిస్తితి రానున్న రోజుల్లో ఏం అవుతుందో.

Read more RELATED
Recommended to you

Exit mobile version