దేశంలో అత్యంత అవినీతి తెలంగాణ లో ఉంది : ఉత్తమ్ కుమార్ రెడ్డి

-

దేశంలో అత్యంత అవినీతి తెలంగాణలోనే ఉందని నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.   ప్రతీ తెలంగాణ పౌరుడి మీద లక్ష రూపాయల అప్పు ఉంది.  అవినీతిని 119 ముక్కలు చేసి సామ్రాజ్యాన్ని స్థాపించారు. దళిత బంధు పేరుతో 3నుంచి 5 లక్షల వరకు బీఆర్ఎస్ నాయకులు లంచం తీసుకుంటున్నారు.

తెలంగాణలో అభివృద్ధి జరగలేదని.. కాంగ్రెస్ చేసిన అభివృద్ధి పనులను చూపించి మేము ఇంత అభివృద్ధి చేశామని చెబుతున్నారని పేర్కొన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. డబుల్ బెడ్ రూం ఇండ్ల మంజూరుకి లంచాలు తీసుకుంటున్నారు. సొంత పార్టీ నేతల వద్ద బీఆర్ఎస్ నేతలు లంచాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా అధికారులతో కుమ్మక్కై లంచాలకు మారుపేరు బీఆర్ఎస్ అనే విధంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేసీఆర్ ఓడిపోతాడనే భయంతోనే రెండు చోట్ల ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాడు. అయితే కేసీఆర్ ని ఓడించేందుకు ఉమ్మడి అభ్యర్థిని పెట్టాలని పార్టీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. 

Read more RELATED
Recommended to you

Exit mobile version