కవితకు ఎందుకు MLC పదవి ఇచ్చావు ? : కేసీఆర్ పై షర్మిల ఫైర్

కల్వకుంట్ల కవితకు ఎందుకు MLC పదవి ఇచ్చావు ? అని తెలంగాణ సీఎం కేసీఆర్ పై షర్మిల ఫైర్ అయ్యారు. శ్రీకాంతాచారి కుటుంబానికి KCR ఏం న్యాయం చేశారు? ఎన్నికల్లో ఆ తల్లి ఓడిపోతే.. MLC పదవి ఇచ్చే అవకాశం ఉన్నా KCR ​ఇవ్వలేదు. KCR కూతురు నిజామాబాద్​లో ఓడిపోతే మాత్రం MLC పదవి ఇచ్చారు. కన్న బిడ్డకు ఒక న్యాయం.. బిడ్డను కోల్పోయిన తల్లికి ఇంకో న్యాయామా? అంటూ నిలదీశారు షర్మిల.

కేసీఆర్ మాటలతో మాయ చేస్తే.. హుజుర్ నగర్ ఎమ్మెల్యే చేతలతో అన్ని మాయం చేస్తుండు. మట్టి దందా, ఇసుక దందా, అక్రమ రేషన్ బియ్యం దందాలో ఆరితేరిండు. భూకబ్జాలు, పేకాట, గుట్కా, గంజాయి వ్యాపారాల్లో అందినకాడికి దండుకుంటుండని సైదిరెడ్డిపై విరుచుకుపడ్డారు షర్మిల. హైదరాబాద్ కు మోడీ గారు వస్తే ఎదురువెళ్లి తెలంగాణ సమస్యలపై ప్రశ్నించే దమ్ము కేసీఆర్ కు లేదు. విభజన హామీలు ఎందుకు నెరవేర్చరని ప్రశ్నించే దమ్ము కేసీఆర్ కు లేదు. మా వడ్లు ఎందుకు కొనరని ప్రశ్నించే దమ్ము కేసీఆర్ కు లేదని చురకలు అంటించారు.