తెలంగాణలో సమస్యలు లేవని నిరూపిస్తే ముక్కునేలకు రాసి వెళ్లిపోతా – షర్మిలా

-

తెలంగాణలో సమస్యలు లేవని నిరూపిస్తే ముక్కునేలకు రాసి వెళ్లిపోతానని వైఎస్ షర్మిలా ఫైర్ అయ్యారు. పికపాక నియోజకవర్గంలో ప్రాజెక్టులున్నా నీళ్లు ఇవ్వడం లేదు. సీతారామ ప్రాజెక్టు భూనిర్వాసితులు పరిహారం కోసం నేటికీ దీక్షలు చేస్తున్నారన్నారు. రూ.3వేల కోట్ల లాభాలతో నడిచే సింగరేణిని, రూ.8వేల కోట్ల అప్పుల్లోకి నెట్టారు. నియోజకవర్గంలో ఫ్యాక్టరీలు ఉన్నా.. స్థానికులకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వడం లేదని మండిపడ్డారు.

పేదల పోడు భూముల్ని ఇష్టారాజ్యంగా గుంజుకుంటున్న ప్రభుత్వం.. ఇక్కడి ఎమ్మెల్యే 500ఎకరాల్లో పోడు సాగు చేస్తున్నా పట్టించుకోవడం లేదని… రూ.33వేల కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత–చేవెళ్లను కాళేశ్వరం పేరుతో రీడిజైన్ చేసి, రూ.లక్షా30వేల కోట్లకు పెంచారన్నారు.

వేల కోట్ల కమీషన్లు దండుకున్నారని… ప్రతిపక్షాలు KCRతో కుమ్మక్కై ప్రశ్నించడం లేదన్నారు. ప్రజలపక్షాన గళం విప్పేందుకే YSR తెలంగాణ పార్టీ పెట్టామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు లేవని నిరూపిస్తే ముక్కునేలకు రాసి వెళ్లిపోతానని సవాల్ విసిరారు. సమస్యలు ఉన్నాయని నిరూపిస్తే KCR రాజీనామా చేసి,దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తారా? అని ఛాలెంజ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news