రాహుల్ గాంధీ గారిపై అనర్హత వేటుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు

ప్రతిపక్షాల గొంతునొక్కడం, కక్షసాధింపు చర్యలకు దిగడం ప్రజాస్వామ్యంలో తగదని వైఎస్‌ షర్మిల అన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గారిపై అనర్హత వేటు ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే అని పేర్కొన్నారు. వాదనలు వినిపించేందుకు రాహుల్ గాంధీ గారికి 30రోజుల సమయం ఉన్నా.. లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయడం నిరంకుశ చర్య అని నిప్పులు చెరిగారు.

ప్రజాస్వామ్యంలో అధికారపక్షం ఎంత ముఖ్యమో.. ప్రతిపక్షం కూడా అంతే ముఖ్యం. రాజకీయ వైరుధ్యాల కంటే రాజ్యాంగ విలువలు గొప్పవి. బీజేపీ చర్యలు ప్రజాస్వామ్యానికి మచ్చతెచ్చేలా ఉన్నాయి. ప్రతిపక్షాలపై అణచివేత తగదని ఫైర్‌ అయ్యారు. పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాల్సిన అవసరం ఉంది.సాధించుకున్న స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవాలన్నా, రాసుకున్న రాజ్యాంగం అమలు కావాలన్నా ఈ నిరంకుశ నిర్ణయాన్ని ముక్త కంఠంతో ఖండించడం ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క పౌరుని బాధ్యత అని పేర్కొన్నారు వైఎస్‌ షర్మిల.