రైతు గర్జన లో మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కీలక కామెంట్స్ చేసారు. మొద్దు నిద్ర పోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరవాలి. రైతు బంధు, రుణ మాఫీ, ధాన్యం కొనుగోళ్ళ కోసం రైతు దీక్ష చేస్తున్నాం. తెలంగాణ కు జరుగుతున్నా అన్యాయాన్ని ఎత్తి చూపెందుకే రైతు దీక్ష. ఎన్నికల్లో చెప్పని ఎన్నో పథకాలు రైతుల కోసం KCR పెట్టిండు. కానీ భూతుల సీఎం గా రేవంత్ రెడ్డి చరిత్ర లో నిలిచిండు.
ఆరు గ్యారెంటీలు అమలు చేసిన అని మహారాష్ట్ర లో రేవంత్ చెపుతుండు. అందరిని మోసం చేసి మహారాష్ట్ర లో అబద్దాలు మాట్లాడుతుండు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని మోసం చేసిండు. రుణమాఫీ చేయలేదని అడిగితె దేవుళ్ళ మీద ఓట్లు పెట్టిండు. దేశంలో దేవుణ్ణి మోసం చేసిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి వచ్చాక గ్యారెంటీ లకు, బాండ్ పేపర్లకు విలువ లేకుండా పోయింది. ఆరు గ్యారెంటీలని కాంగ్రెస్ ఓట్లను డబ్బాలో వేసుకుంది. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిండ్రు కాంగ్రెసొళ్ళు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని మోసం చేసిండ్రు అని హరీష్ రావు పేర్కొన్నారు.