ఖమ్మం సభకు వస్తామని సోనియా చెప్పారు – కోమటిరెడ్డి

-

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, సోనియా గాంధీతో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు. ఢిల్లీలో జరిగిన ఈ భేటీలో తెలంగాణ తాజా రాజకీయ పరిస్థితులు, మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర పై కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రియాంక గాంధీతో చర్చించారు. అలాగే ఖమ్మం, నల్గొండలో జరగనున్న సభలకు రావాల్సిందిగా ఆమెను ఆహ్వానించారు. అనంతరం వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి పది రోజులకు ఒకసారి తెలంగాణకు రావాలని ప్రియాంక గాంధీని కోరినట్లు తెలిపారు.

తెలంగాణలో 4 కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారని సోనియా గాంధీకి చెప్పానన్నారు వెంకటరెడ్డి. ఒకరి పాదయాత్రకు మరొరకం సహకరిస్తున్నామని చెప్పానన్నారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించానన్నారు. తెలంగాణలో పరిస్థితులను సోనియాకు వివరించానని తెలిపారు. వీలుంటే ఖమ్మం సభకు వస్తామని సోనియా చెప్పారని వివరించారు. కర్నాటక తరహాలో టికెట్లు ముందే ప్రకటించాలని కోరానన్నారు. జులై 7 తరువాత డేట్‌ ఇస్తామని సోనియా అన్నారని చెప్పారు. ఈ మూడు నెలల్లో 33 జిల్లాలు కవర్‌ చేయాలని మేడంను కోరామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version