నారాయణ కాలేజీ ప్రిన్సిపల్ ను తరిమికొట్టిన బాధితులు !

-

నారాయణ కాలేజీ ప్రిన్సిపల్ ను తరిమికొట్టారు బాధితులు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్‌ గా మారింది. నారాయణ కాలేజీ ప్రిన్సిపల్ పై దాడి చేశారు. రామ్ రెడ్డిని తరిమి తరిమి కొట్టిన పేరెంట్స్.. బూతులతో రెచ్చిపోయారు. లెక్చరర్ వేధింపులతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న తనుష్ కుటుంబ సభ్యులు.. రామ్ రెడ్డిని తరిమి తరిమి కొట్టారు.

Student suicide in Narayana College Relatives who ran and beat the principal

దీంతో నారాయణ కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాగా మేడ్చల్‌లోని నారాయణ కాలేజీలో తనుష్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. లెక్చరర్‌ల వేధింపులు తట్టుకోలేకే సూసైడ్ చేసుకున్నట్టు సమాచారం అందుతోంది. దీంతో.. కాలేజీ వద్ద తల్లిదండ్రులు, బంధువుల ఆందోళనకు దిగారు. ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version