టిఆర్ఎస్ పార్టీ జహీరాబాద్ ఎంపీ భీమారావు బసంతారావు పాటిల్ (బి.బి పాటిల్) కి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తనపై ఉన్న నేరాలను ఎన్నికల అఫీడవిట్ లో బిబి పాటిల్ పేర్కొనలేదని.. ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ అభ్యర్థి అయిన మదన్మోహన్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఈ పిటిషన్ ను కొట్టివేయగా.. పిటీషనర్ సుప్రీం లో సవాల్ చేశారు.
దీంతో బిబి పాటిల్ ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్ పై పునః పరిశీలన జరపాలని తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది. అక్టోబర్ 10వ తేదీన హైకోర్టుకు హాజరుకావాలని ఈ తీర్పులో పేర్కొంది. ఈ కేసులోని అన్ని అంశాలు ఓపెన్ గానే ఉంటాయని తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.