ఇబ్రహీంపట్నం బాధితులకు నిమ్స్ లో ట్రీట్ మెంట్ పై సంతృప్తిగా ఉన్నారని తెలిపారు గవర్నర్ తమిళ్ సై. ఆర్థిక సహాయం కోరుతున్నారు.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సహాయం చేయాలని సుచిస్తానని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరాృతం కాకూడదని.. ఎక్కువ ఆపరేషన్ లు చేయాలన్న టార్గెట్ తో ఇలా చేయకూడదని హెచ్చరించారు.
కుటుంబ నియంత్రణ అంటే మరింత మంది ముందుకు వచ్చేలా చేయాలి.. ఇలా చేస్తే ముందుకి వచ్చే వాళ్ళ ధైర్యం దెబ్బతింటుందని ఫైర్ అయ్యారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లు సజావుగా మంచిగా జరగాలన్నారు.
నలుగురు చనిపోవడం అనేది మామూలు విషయం కాదని.. విచారణ జరుగుతోంది. అది వచ్చాక పూర్తి కారణాలు తెలుస్తాయన్నారు. త్వరగా ఎక్కువ ఆపరేషన్ లు చేయాలన్న టార్గెట్, ఇన్ఫెక్షన్ వల్ల జరిగిందని డాక్టర్ గా నేను భావిస్తున్నానని వెల్లడించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సదుపయాలు మెరుగుపరచాలని ప్రభుత్వానికి లేఖ రాస్తానని ప్రకటించారు గవర్నర్ తమిళ్ సై.