తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్…బంగాళా ఖాతం లో మరో అల్పపీడనం ఏర్పడనుందట. దీని కారణంగా తెలంగాణ, ఏపీకి 5 రోజుల పాటు వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.ఇటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నిజామాబాద్ సంగారెడ్డి వికారాబాద్ కామారెడ్డి మెదక్ జిలాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
అదిలాబాద్ హైదరాబాద్ భద్రాద్రి జగిత్యాల జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలకు ప్రకటించింది వాతావరణ శాఖ. హైదరాబాద్… నగరంలో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని… తప్ప ఇంటికి రాకూడదని హెచ్చరించింది వాతావరణ శాఖ.ఇక నిన్నటి వర్షాలతో నగరంలోని చందానగర్, మాదాపూర్ ,గచ్చిబౌలి, ప్రగతినగర్ , పటాన్ చెరు, రామచంద్రాపురం, నిజాంపేట్,అమీన్ పూర్ పరిసర్ ప్రాంతాల్లో వర్షం పడింది. జూబ్లీహిల్స్, బంజారా హిల్ష్, ఫిలింనగర్ , మెహదీపట్నం పరిసర ప్రాంతాల్లో భారీ కురుస్తోంది. లొతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.