అత్యధిక ఉద్యోగ నైపుణ్యాలున్న 18-21 ఏళ్ల యువతలో తెలంగాణ అగ్రస్థానం

-

ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలున్న 18-21 ఏళ్ల యువతలో తెలంగాణ దేశంలోనే టాప్లో నిలిచింది. ఆ వయసులోని 85.45 శాతం మందికి కొలువుకు తగిన అర్హతలున్నాయని అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ), ఇతర సంస్థలతో కలిసి వీబాక్స్‌ రూపొందించిన ‘భారతదేశ నైపుణ్య నివేదిక’లో వెల్లడైంది. నగరాల్లో చూస్తే పుణె(80.82%) తొలి స్థానాన్ని దక్కించుకోగా హైదరాబాద్‌ ఏడో స్థానం(51.50%)లో నిలిచింది. వయసుకు అతీతంగా నైపుణ్యమున్న యువతను పరిగణనలోకి తీసుకుంటే హరియాణా(76.47%) తొలిస్థానంలో నిలిచింది. తెలంగాణ(67.79%)కు ఆరోస్థానం దక్కింది.

యువతలో ఉద్యోగ నైపుణ్యాలకు సంబంధించి వీబాక్స్‌ సంస్థ సర్వేలో భాగంగా గత 11 సంవత్సరాలుగా వీబాక్స్‌ నేషనల్‌ ఎంప్లాయబిలిటీ టెస్ట్‌(వీనెట్‌)ను నిర్వహిస్తోంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 3.88 లక్షల మంది పరీక్షలో పాల్గొనగా.. వారిలో దేశవ్యాప్త సగటు(60 శాతం మార్కులు సాధించింది) 51.25 శాతం ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.

నివేదికలో ముఖ్యాంశాలు..

అత్యధిక న్యూమరికల్‌ స్కిల్స్‌ ఉన్న యువత తెలంగాణలోనే ఉంది.

అత్యధిక (44.01 శాతం) ఉద్యోగ నైపుణ్యాలున్న అమ్మాయిలతో బెంగళూరు నంబర్ వన్గా నిలిచింది.

ఉద్యోగం చేసేందుకు యువతీ యువకుల తొలి ప్రాధాన్య రాష్ట్రంగా కేరళ నిలిచింది.

ఆంగ్ల భాషా నైపుణ్యాల్లో కర్ణాటక(73.33 శాతంతో) తొలి స్థానం దక్కించుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version