నెల రోజుల్లో సీఎం రేవంత్ సాధించింది ఆ ఒక్కటే : బూర నర్సయ్య గౌడ్

-

తెలంగాణ బీజేపీ నాయకుడు, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త ఏడాది తెలంగాణ ఆస్తులు పెరిగి గ్యారెంటీ లు అమలు చేయాలని ఆశిస్తున్నానన్నారు. ఈ 30 రోజుల్లో కాంగ్రెస్ సాధించింది కేవలం శ్వేత పత్రం మాత్రమేనని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ కే గ్యారంటీ లేదు.. అందుకే కాలయాపన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలు మోసపోతే గోస పడతారన్నారు. బీఆర్ఎస్ చేమాడొడ్చి చేసింది రూ.6.32 వేల కోట్ల అప్పు అని అన్నారు. బీజేపీ మాత్రం చేసేది కొండంత చెప్పేది కొండంత అని అన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ  వేసిన రోడ్ల వల్లే రాష్ట్రంలో భూముల రేట్లు పెరిగాయన్నారు. రాష్ట్రంలో ఒక్క రోడ్డును కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించలేదన్నారు. మోడీ జెన్ కో ట్రాన్స్ కోకి రూ.80 వేల కోట్ల అప్పు ఇస్తే కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇచ్చారు. ఖజానా లేదని.. అందుకే సీఎం రేవంత్ కళ్లలో ఆనందం కూడా లేదన్నారు. కేసీఆర్ మొత్తం గికేసి పోయాడన్నారు. తెలంగాణ అబివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో ఉన్న 17 ఎంపీ సీట్లలో బీజేపీని గెలిపించాలని ప్రజలను కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version