తెలంగాణకు పొంచి ఉన్న వాయుగుండం ముప్పు..!

-

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం తీవ్ర వాయుగుండంగా మారిన విషయం తెలిసిందే. దీంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు, చెరువులు, వాగులు, వంకలు నిండుకుండల్లా మారిపోయాయి. రాష్ట్రంలో ఎక్కడ చూసినా వరదలు ప్రవహిస్తున్నాయి. వాయుగుండం ఆదివారం అర్ధరాత్రి 12.30 నుంచి 2.30 నిమిషాల మధ్య కళింగపట్నం వద్ద తీరం దాటింది.

వాయుగుండం కారణంగా ఏర్పడిన భారీ మేఘాలు తెలంగాణ రాష్ట్రంపై విస్తారంగా కమ్ముకొని.. మెల్లమెల్లగా  కదులుతున్నాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాయుగుండం ముప్పు పొంచి ఉంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.  ఇప్పటికే వాతావరణ శాఖ రాష్ట్రంలోని పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు అత్యధిక వర్షపాతం నమోదైన 20 ప్రాంతాల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి 10 ప్రాంతాలు ఉండటం విశేషం.

Read more RELATED
Recommended to you

Exit mobile version