మేడారం జాతరలో ఎస్సైని కొట్టారు ఎస్పీ. సమ్మక్క గద్దెల వద్దకు వెళ్లాలని అడిగినందుకు ఎస్సైని భార్య, పిల్లల ముందే చెంప మీద కొట్టి, బూతులు తిట్టి కింద కూర్చోబెట్టి పనిష్మెంట్ ఇచ్చారు ఎస్పీ ఆలం గౌష్. దీంతో అదిలాబాద్ ఎస్పీ ఆలం గౌష్ తీరు…వివాదాస్పదం అవుతోంది. కానీ మేడారంలో రేవంత్ రెడ్డి వెంట సునీల్ కనుగోలుకు వీఐపీ ఎంట్రీ ఇచ్చారు పోలీసులు. ప్రతి జాతరలో పోలీసు కటుంబాలకు డైరెక్ట్ దర్శనం పెట్టే వారు, ఈసారి మాత్రం మేడారం జాతరలో పెట్టలేదు. మేడారం మహాజాతర సందర్భంగా వరంగల్ కమిషనరేట్‌కు చెందిన ఏఆర్ ఎస్సై రవికూమార్ డ్యూటీ నిర్వహిస్తుండగా తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవార్ల దర్శనానికి వెళ్తున్న సమయంలో ఆదిలాబాద్ ఎస్పీ గౌష్ అలం ఎస్సెని భార్య, పిల్లల ముందే చెంప మీద కొట్టి, బూతులు తిడుతూ కింద కూర్చోబెట్టి పనిష్మెంట్ ఇచ్చాడు.
ఈ హఠత్పరిణామానికి బిత్తరపోయిన ఎస్సై కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటనను చూసిన తొటి సిబ్బంది నిరసన తెలిపే ప్రయత్నం చేయగా ఉన్నతాధికారులు శాంతిపజేశారు. గౌష్ అలంపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకో వాలని కింది స్థాయి కానిస్టేబుల్స్ డిమాండ్ చేస్తున్నారు. విధులు నిర్వహించి కుటుంబ సభ్యులను దర్శనం కోసం తీసుకెళ్తున్న ఎస్సె రవికూమార్ను ఎస్పీ చేయిచేసుకోవడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఉన్నాతాధికారుల కుటంబాలకు మాత్రమే డైరెక్ట్ దర్శనమా? మా కుటుంబాలకు అవకాశం లేదా అని ఆవేదన వ్యక్తం చేశారు పోలీస్ కానిస్టేబుల్స్. అంతే కాకుండా 2వ తేదీని హెడ్ క్వార్టర్ ఎదుట సీపీ ఆధ్వర్యంలో దర్బార్ పెట్టి ఎస్పీ ఏస్సె రవికూమార్ కు క్షమాపణ చెప్పాలని, లేకుంటే మేడారంలో ప్రజల ముందు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో హెడ్ క్వార్టర్స్ ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు.