మార్గదర్శి కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!

-

సుప్రీంకోర్టులో మార్గదర్శికి ఎదురుదెబ్బ తగిలింది. మార్గదర్శి పై విచారణను కొట్టివేస్తూ.. గతంలో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. డిపాజిట్ల పై సమగ్ర పరిశీలన జరగాల్సిన అవసరం ఉందని.. తెలంగాణ హైకోర్టుకు మార్గదర్శి డిపాజిట్ల కేసు రిఫర్ చేస్తున్నట్టు తీర్పు వెల్లడించింది సుప్రీంకోర్టు. మార్గదర్శి అక్రమాలకు సంబంధించిన పిటిషన్ ను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా గత వాదనల ఆధారంగా ద్విసభ్య బెంచ్ కీలక తీర్పు వెల్లడించింది.

‘డిపాజిట్లపై సమగ్ర పరిశీలన జరగాలి. పబ్లిక్ నోటీసు ఇచ్చి.. ఇంకా ఎవరైనా డిపాజిటర్లకి మనీ ఇంకా తిరిగి ఇవ్వలేదా? అనేది తెలుసుకోవాలి. ఇందుగానూ హైకోర్టు మాజీ జడ్జి ఒకరిని నియమించాలి. ఏపీలో కూడా డిపాజిటర్లు ఉన్నారు కాబట్టే అనుమతి ఇచ్చాం. మేము మెరిట్స్లోకి వెళ్ళడం లేదు. మేము తెలంగాణ హై కోర్టుకు రిఫర్ చేస్తున్నాం. రెండు మూడు నెలల్లో డిపాజిట్లపై సమగ్ర పరిశీలన జరపాలి. ఆర్ బీఐ కూడా హైకోర్టుకు కూడా ఈ ప్రక్రియల్లో పాలు పంచుకోవాలి. ఉండవల్లి అరుణ్ కుమార్ సహకరించాలి.తెలంగాణ, ఏపీ ప్రభుత్వం, ఆర్బిఐ, ఉండవల్లి ఈ కేసులో వాదనలు వినిపించాలి. ఆరు నెలల్లో ఈ కేసు విచారణ తెలంగాణ హైకోర్టు పూర్తి చేయాలి. ఈ కేసుపై మేము ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం. తెలంగాణ హైకోర్టు లో వాదనలు వినిపించండి’ అని ద్విసభ్య ధర్మాసనం తీర్పు ద్వారా స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version