తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బ్యాక్ గ్రౌండ్ ఇదే

-

తమిళ సై రాజీనామా నేపథ్యంలో తెలంగాణకు కొత్త గవర్నర్ వచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా సిపి రాధాకృష్ణన్ నియామకం అయ్యారు. అయితే తెలంగాణ గవర్నర్గా ఇవాళ ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఒక్కసారి తెలంగాణ కొత్త గవర్నర్ రాధాకృష్ణ నేపద్యం చూసుకున్నట్లయితే… అతనిది కూడా తమిళనాడు రాష్ట్రమే.

Telangana Governor CP Radhakrishnan

తమిళనాడులోని కోయంబత్తూర్ లోక్సభ స్థానం నుంచి రెండుసార్లు బిజెపి ఎంపీగా ఎన్నికయ్యారు రాధాకృష్ణన్. అలాగే తమిళనాడు బిజెపి చీఫ్ గా కూడా ఆయన పని చేశారు. ఆల్ ఇండియా కాయర్ బోర్డు చైర్మన్గా 2016 సంవత్సరం నుంచి 2019 సంవత్సరం వరకు సేవలు కూడా అందించారు. గత సంవత్సరం ఫిబ్రవరిలో జార్ఖండ్ గవర్నర్గా బాధ్యతలు తీసుకున్నారు రాధాకృష్ణ న్. ఇప్పుడు తెలంగాణ గవర్నర్గా అలాగే పుదున్చేరి ఇన్చార్జి లెఫ్ట్నెంట్ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు సిపి రాధాకృష్ణన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version