రేవంత్ సపోర్ట్: జగ్గన్న తగ్గేదేలే!

-

గత కొన్ని రోజులుగా తెలంగాణ కాంగ్రెస్‌లో జగ్గారెడ్డి వ్యవహారం బాగా హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే…రేవంత్ రెడ్డి పి‌సి‌సి అధ్యక్షుడు అయిన దగ్గర నుంచి జగ్గారెడ్డి పూర్తిగా తనదైన శైలిలో రాజకీయం చేస్తూ…రేవంత్‌కు వ్యతిరేకంగా ముందుకెళుతున్న విషయం తెలిసిందే. పలు సందర్భాల్లో రేవంత్‌పై బహిరంగంగానే విమర్శలు కూడా చేశారు. అలాగే రేవంత్‌ని పి‌సి‌సి పదవి నుంచి తప్పించాలని ఏకంగా సోనియా గాంధీకి లేఖ రాశారు.

ఇలా రేవంత్‌పై జగ్గారెడ్డి ఎప్పటికప్పుడు పరోక్షంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు…ఇలా రేవంత్‌ని టార్గెట్ చేసిన జగ్గారెడ్డిని రేవంత్ వర్గం కూడా గట్టిగానే టార్గెట్ చేసింది..జగ్గారెడ్డి టీఆర్ఎస్ కోవర్టు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు. ఈ విషయం జగ్గారెడ్డి వరకు వచ్చింది…దీంతో ఇదంతా రేవంత్ చేయిస్తున్నారని గుర్రుగా ఉన్నారు..అలాగే తాజాగా కాంగ్రెస్‌కు రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు. కానీ సీనియర్లు బ్రతిమలాడటంతో జగ్గారెడ్డి…15 రోజులు వేచి చూస్తానని, ఈ లోపు తనకు సోనియా, రాహుల్ అపాయింట్‌మెంట్ ఇప్పించాలని కోరారు. వారితోనే అన్నీ మాట్లాడతానని, ఆ తర్వాతే కాంగ్రెస్‌లో ఉండాలా? లేదా? అనే నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.

అయితే అపాయింట్‌మెంట్ దొరికితే ఓకే..లేదంటే జగ్గారెడ్డి ఖచ్చితంగా కాంగ్రెస్ వీడిపోతారని అర్ధమవుతుంది. ఇక జగ్గారెడ్డి వ్యవహారంపై రేవంత్ స్పందిస్తూ.. జగ్గారెడ్డిపై సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై సైబర్‌ క్రైమ్‌కు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, ఆయనకు తామంతా అండగా ఉంటామని, జగ్గారెడ్డి తనకు మిత్రుడు అని, ఇది మా కుటుంబ సమస్య అని అన్నారు.

ఇక సోషల్ మీడియాలో వ్యతిరేకంగా ప్రచారం వస్తే భయపడకూడదని, అప్పుడు శత్రువులు మరింత రెచ్చిపోతారని, కౌశిక్ రెడ్డి అనుచరులు కాంగ్రెస్‌లో చిచ్చు పెట్టే కార్యక్రమం చేస్తున్నారని రేవంత్ చెప్పారు. అంటే కాస్త జగ్గారెడ్డికి సపోర్ట్‌గా మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ జగ్గారెడ్డి మాత్రం తన దారిలో తాను వెళ్ళేల ఉన్నారు..ఆయన ఖచ్చితంగా కాంగ్రెస్‌ని వీడటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news