తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా ఇవాళ ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే సభకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ సభకు భారీ సంఖ్యలో రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు తరలివస్తున్నారు. దీంతో ఎన్టీఆర్ స్టేడియం పరిసరాల్లో 17వ తేదీ మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 7 గంటల వరకు ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుందని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ స్టేడియంకు వచ్చే చుట్టూ పక్కల మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు.
కవాడిగూడ ఎక్స్‌రోడ్స్ నుంచి షెయిలింగ్ క్లబ్, లోయర్ ట్యాంక్ బండ్‌కు ట్రాఫిక్ అనుమతి లేదు. ఈ వాహనాలను కవాడిగూడ ఎక్స్ రోడ్స్ నుంచి బైబిల్ హౌస్ వైపు మళ్లిస్తారు. అశోక్‌నగర్ నుంచి ఎన్టీఆర్ స్టేడియం వైపు అనుమతి లేదు. ఈ వాహనాలను బాకారం బ్రిడ్జి నుంచి సీజీవో టవర్స్ బన్సీలాల్‌పేట్ వైపు మళ్లిస్తారు. ముషీరాబాద్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డు మీదుగా ఎన్టీఆర్ స్టేడియం వైపు ట్రాఫిక్‌కు అనుమతించరు. ఆర్టీసీ క్రాస్‌రోడ్డు వద్ద నుంచి నారాయణగూడ క్రాస్‌రోడ్డు వైపు మళ్లిస్తారు. ఆజామాబాద్ జంక్షన్ నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్డు వైపు ట్రాఫిక్ అనుమతించరు. ఈ ట్రాఫిక్‌ను వీఎస్టీ క్రాస్‌రోడ్స్ నుంచి బాగ్‌లింగంపల్లి వైపు మళ్లిస్తారు. సాధురామ్ కంటి ఆస్పత్రి నుంచి ఏవీ కాలేజీ మీదుగా ఎన్టీఆర్ స్టేడియం వైపు ట్రాఫిక్ అనుమతించరు. దోమల్‌గూడ టీ జంక్షన్ నుంచి చిక్కడపల్లి మెట్రో స్టేషన్, ఆర్టీసీ క్రాస్ రోడ్డువైపు మళ్లిస్తారు. లిబర్టీ నుంచి అప్పర్‌ట్యాంక్ బండ్‌కు ట్రాఫిక్‌ను అనుమతించరు. లిబర్టీ వద్ద హిమాయత్‌నగర్ వైపు మళ్లిస్తారు.
ఇక్బాల్ మినార్ నుంచి తెలుగుతల్లి ఫ్లై ఓవర్ వైపు ట్రాఫిక్‌ను అనుమతించరు. పాత సచివాలయం గేట్ నుంచి అంబేద్కర్ విగ్రహం మీదుగా లిబర్టీ వైపు మళ్లిస్తారు. నారాయణగూడ నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్డుకు.. అక్కడి నుంచి ఎన్టీఆర్ స్టేడియం వైపు వాహనాలకు అనుమతి లేదు. ఆర్టీసీ క్రాస్‌రోడ్డు నుంచి ఆ వాహనాలను ముషీరాబాద్ వైపు మళ్లిస్తారు. రాణిగంజ్, ఎంజీరోడ్డు, ఆర్పీరోడ్డు నుంచి అప్పర్ ట్యాంక్ వైపు ట్రాఫిక్‌కు అనుమతి లేదు. ఈ వాహనాలను కర్బాలా మైదాన్ నుంచి బైబిల్ హౌస్, ముషీరాబాద్ వైపు మళ్లిస్తారు. తెలుగు తల్లి ఫ్లై ఓవర్, ఇక్బాల్ మినార్ (రవీంద్రభారతి) నుంచి కట్టమైసమ్మ వైపు అనుమతిలేదు. కట్టమైసమ్మ ఆలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వెళ్లే రోడ్డు మూసి ఉంటుంది. నెక్లెస్ రోడ్డు కూడా రెండు వైపులా మూసి ఉంటుంది. ట్రాఫిక్‌కు అనుమతి ఉండదు. ఆ జంక్షన్ల మీదుగా వెళ్లవద్దు.. సాధారణ వాహనాదారులు ఎన్టీఆర్ స్టేడియంకు మూడు కిలోమీటర్ల పరిధిలోని అంబేద్కర్ విగ్రహం, కవాడిగూడ ఎక్స్ రోడ్, ఎన్టీఆర్ స్టేడియం, ట్యాంక్‌బండ్, లోయర్ ట్యాంక్‌బండ్, లిబర్టీ, నెక్లెస్ రోడ్, అశోక్‌నగర్, ఇందిరా పార్కు ప్రధాన జంక్షన్ మీదుగా వెళ్లవద్దని పోలీసులు సూచించారు.