తృతీయ జ్యువలరీ అధినేత కాంతి దత్ ఒకరోజు కస్టడీ విచారణ ముగిసింది. 6 గంటల పాటు కాంతి దత్ ను విచారించి స్టేట్ మెంట్ రికార్డు చేసి జ్యుడీషియల్ రిమాండ్ తరలించారు పోలిసులు. కాంతి దత్ సెలబ్రిటీలు , వ్యాపారవేత్తలను వాటాల పేరుతో ఎలా మోసం చేసాడు. వందల కోట్ల రూపాయలు ఏమయ్యాయి. ఫోర్జరీ చేసి సెలబ్రెటీలను ఎలా చిట్ చేసాడు, ఎంత మేర డబ్బు దోచుకున్నాడు. కాంతి దత్ లిస్ట్ లో ఎంతమంది సెలెబ్రిటీలు ఉన్నారు.. అతని మోసాలకు బలైన సెలెబ్రిటీల లిస్ట్ ఏంటి.. కాంతి దత్ ఐదారు రోజుల క్రితం సస్టైనబుల్ కార్ట్‌తో నష్టాలు వచ్చాయని, అందుకే మూసేశాననీ ట్వీట్ పెట్టడానికి కారణం ఏంటి.. ఇలా వివిధ కోణాల్లో ప్రశ్నించి స్టేట్ మెంట్ రికార్డు చేసారు జూబ్లీహిల్స్ పోలీసులు.
అయితే బాధితుల్లో బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా ఇచిన ఫిర్యాదు మేరకు ఇటీవలే కాంతి దత్ ను అరెస్ట్ చేసారు జూబ్లీహిల్స్ పోలీస్. హీరోయిన్ సమంత, కీర్తి సురేష్, డిజైనర్ శిల్పా రెడ్డి తదితరులను మోసం చేసాడు కాంతి దత్. అలాగే కతార్ కి చెందిన ప్రవీణ్ అనే వ్యాపారి వద్ద 6 కోట్లు వసూలు చేసిన కాంతి దత్ మీద సీసీఎస్ లో కేసు నమోదు అయ్యింది.