ప్రజలు ఎన్నుకుంటేనే కల్వకుంట్ల కుటుంబం అధికారంలో ఉంది: కేటీఆర్

-

ప్రజలు ఎన్నుకుంటేనే కల్వకుంట్ల కుటుంబం అధికారంలో ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఈ విమర్శలను కేటీఆర్ తిప్పికొట్టారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడితే… గొంగళ్లలో వెంట్రుకలు ఏరుకున్నట్లు ఉంటుందని ఎద్దేవా చేశారు. ఎన్టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్య్వూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రభుత్వ వ్యతిరేఖ ఓటు ఏమీ లేదని.. దళితుల, పేదవర్గాల ఓటు చీల్చేందుకు వైఎస్ షర్మిళ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లు తిరుగుతున్నారని విమర్శించారు. వీరిద్దరు సీఎం కేసీఆర్ ను విమర్శిస్తారు కానీ… ప్రధాని మోదీని ఎందుకు విమర్శించరని ప్రశ్నించారు. తెలంగాణలో కులం, మతం ఆధారంగా రాజకీయాలు నడవవు అన్నారు.  తెలంగాణలో టీఆర్ఎస్ పాలనపై వ్యతిరేఖత లేదు. గవర్నర్ అధికారాన్ని అపరిమితంగా ఊహించుకుంటున్నారని ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని గవర్నర్ ఎలా కూలస్తారని ప్రశ్నించారు. రాజకీయా పార్టీల సభ్యులను గవర్నర్ గా ఉంచవద్దని గతంలో మోదీనే చెప్పారని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో గవర్నర్ పాత్ర చాలా పరిమితం అని అన్నారు. ఇవ్వని మెడికల్ కాలేజీని ఇచ్చినట్లు చెబుతున్నారని.. గవర్నర్ కావాలంటే బీజేపీ కార్యకర్తలా పనిచేయవచ్చని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news