మోడీకి చెప్పులతో స్వాగతం పలుకుతాం – టిఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద

మోడీకి చెప్పులతో స్వాగతం పలుకుతామని హెచ్చరించారు టిఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద. పంజాబ్ లో ప్రజల చేత తిరస్కరించబడ్డ నేత తరుణ్ చుగ్…ఆయన వచ్చి ఇక్కడ కేసిఆర్ మీద మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. తరుణ్ చుగ్ మీ పనులు మీరు చూసుకోండి, మా నాయకుని మీద బురద జల్లితే ఊరుకోమని హెచ్చరించారు.

మా ప్రభుత్వం మీద మాట్లాడే స్థాయి కాదు మీది బేవకూఫ్ మాటలు మానండి..తరుణ్ ఛుగ్ ఒళ్ళుదగ్గర పెట్టుకుని మాట్లాడాలి..అని పేర్కొన్నారు.భ్యాగ్య లక్ష్మి అమ్మదగ్గరికి వచ్చి మొక్కుడు కాదు, ఏం నిధులు తీస్తారో చెప్పండి..మోడీ కంటే 17ఏళ్ల ముందే కేసిఆర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అసెంబ్లీకి వెళ్లారన్నారు.

రాజకీయాల్లో మోడీ కంటే కేసిఆర్ సీనియర్ అని…వచ్చే ఎన్నికల్లో బీజేపీ ది మూడో స్థానమే అన్నారు. ఎంతమంది నేతలు వచ్చినా కేసిఆర్ వెంట్రుక కూడా పీకలేరు…బెంగాల్ లో కాళీకను చూశారు. తెలంగాణలో ఉగ్ర నర్సింహా స్వామిని చూస్తారని స్పష్టం చేశారు.