నేడు హైదరాబాద్ లో టీఆర్ఎస్ పండగ జరగబోతోంది. పార్టీ ఆవిర్భవించి 21 ఏళ్లు అవుతుండటంతో ఘనంగా ప్లీనరీ వేడుకలు జరగనున్నాయి. ఈ ప్లీనరీలో కీలకమైన అంశాలపై తీర్మాణాలు చేయనున్నారు. అయితే ఏ అంశాలను ప్రకటిస్తారనేదానిపై, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై తెలంగాణ ప్రజల్లో ఆసక్తి నెలకొంది. టీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించి… అపారమైన మద్దతు ఇచ్చిన తెలంగాణ ప్రజలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పారు ఎమ్మెల్సీ కవిత. సంకీర్ణ ప్రభుత్వం దేశాన్ని పాలించబోతోందన్న నమ్మకం కేసీఆర్ కు ఉందని కవిత అన్నారు. రాజ్యాంగ ప్రక్రియకు అనుగుణంగా, శాంతియుత ఉద్యమం ద్వారా తెలంగాణ ఏర్పడిందని…. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ రాష్ట్ర ప్రజల కోసం పనిచేశారని ఆమె అన్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం రాష్ట్ర అభివృద్ధి కోసం టీఆర్ఎస్ పార్టీ ఎంతో కష్టపడిందని… రాబోయే కాలంలో టీఆర్ఎస్ జాతీయ పాత్ర పోషిస్తుందని… దేశం కోసం పనిచేస్తామని కవిత స్పష్టం చేశారు.