ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ… ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థుల కోసం సీట్లు పెంచాల్సిందిగా విజ్ఞప్తి

-

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఉక్రెయిన్ లో మెడిసిన్ చదువులున్న విద్యార్థులంతా స్వదేశానికి చేరుకున్నారు. అయితే పలు రాష్ట్రాలు మెడిసిన్ మధ్యలో ఆపేసిన విద్యార్థులు ఇండియాలో తమ విద్యను కొనసాగేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నాయి. మరోవైపు సుప్రీం కోర్ట్ లో కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉంటే ఉక్రె్యిన్ విద్యార్థుల కోసం మెడికల్ సీట్లు పెంచాల్సిందిగా కోరుతూ… తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన విద్యార్థులు తమ వైద్య విద్యను కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలని లేఖలో కోరారు. ఉక్రెయిన్ విద్యార్థుల కోసం అదనంగా సీట్లు పెంచాలని లేఖలో కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఉక్రెయిన్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి 700 మంది వైద్య విద్యార్థులు వచ్చారని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రానికి చెందిన విద్యార్థుల ఫీజులను ప్రభుత్వం భరిస్తుందని… విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మానవతా దృక్పథంతో అనుమతి ఇవ్వాలని సీఎం కేసీఆర్, ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news