ప్రధానిని, రాష్ట్రపతిని కూడా గౌరవించడం KCR కు రాదు – కిషన్‌ రెడ్డి

-

సీఎం కేసీఆర్‌ పై కేంద్రమంత్రి G కిషన్ రెడ్డి ఆగ్రహించారు. పార్లమెంట్లో రాష్ట్రపతి గారి బడ్జెట్ ప్రసంగాన్ని బాయ్ కాట్ చేయాలంటూ బీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ పిలుపునివ్వడం రాజ్యాంగానికి, రాజ్యాంగబద్ధ సంస్థలకు, రాజ్యాంగబద్ధ పదవులకు వారిచ్చే గౌరవానికి నిదర్శనమని ఫైర్‌ అయ్యారు.

రాజ్యాంగాన్ని గౌరవించడం చేతకాని సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగాన్ని పదే పదే అవమానపరుస్తున్నారని ఓ రేంజ్‌ లో నిప్పులు చెరిగారు. ఎమ్మెల్యే, ఎంపీలనే కాదు చివరకు గవర్నర్లను, ప్రధానిని, రాష్ట్రపతి ని కూడా గౌరవించడం KCR కు రాదన్నారు.

ఉప ఎన్నికల్లో గెలిచిన ఈటలను అసెంబ్లీలో మాట్లాడనీయకుండా చేసి, సస్పెండ్ చేస్తున్న మీరు, మాకు నీతులు చెప్పాలా? అని ప్రశ్నించారు కేంద్రమంత్రి G కిషన్ రెడ్డి. ప్రతిసారి రాజీనామాకు సిద్ధమని చెప్పే నాయకులని చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మీరు రాజీనామా చేయాల్సిన పని లేకుండానే 3-4 నెలల్లో ఎన్నికలు రాగానే ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు కేంద్రమంత్రి G కిషన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version