భారీ వర్షాలపై..కేసీఆర్‌ లో చలనం ఏది ? – విజయశాంతి

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల ఎకరాలకు పైగా పంటలపై ఎఫెక్ట్‌‌ పడిందని… ప్రధానంగా పత్తి, సోయా, మక్కలు, పెసర్లు, మినుములు, వరి పొలాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు విజయశాంతి. అయినా కేసీఆర్‌ లో చలనమే లేదని ఆగ్రహించారు. గత నెలలో కురిసిన వర్షాలకు గోదావరి నదీ తీర ప్రాంతాల్లోని జిల్లాలపై తీవ్ర ప్రభావం పడింది. తాజాగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్‌‌ పరిసర జిల్లాల్లోని పంటలు దెబ్బతిన్నయి. దీంతో రైతులు చాలా నష్టపోయారు. రాష్ట్రంలో ఇంత పెద్ద మొత్తంలో పంటలకు నష్టం జరిగినా సర్కారులో ఎలాంటి చలనం లేదని విమర్శలు చేశారు.


తాజాగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్‌‌ పరిసర జిల్లాల్లోని పంటలు భారీగా దెబ్బతిన్నయి. రంగారెడ్డి, వికారాబాద్‌‌, తాండూరు, చేవెళ్ల, పరిగి తదితర ప్రాంతాల్లో పెద్దఎత్తున పంట నష్టం జరిగింది. పరిగి మండలంలోని నష్కల్‌‌, రుకుంపల్లి, గొట్టిముక్కుల గ్రామాల్లో పంట చేన్లన్నీ మట్టితో సహా కొట్టుకుపోయాయి. ఈ గ్రామాల పరిధిలోనే 10వేల ఎకరాల్లో పత్తి, మక్క, కంది, పసుపు, వరి పంటలు నామరూపాల్లేకుండా పోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి దాకా 85 లక్షల ఎకరాలకు పైగా సాగు జరిగింది. ఇప్పటికే వేసిన పంటలపై వర్షాలు ప్రతికూల ప్రభావం చూపగా తాజాగా కురుస్తున్న వానలతో తీవ్ర నష్టం జరుగుతోందన్నారు.

45.42లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. గత నెలలో కురిసిన వర్షాలకు దాదాపు 12 లక్షల ఎకరాల్లో పత్తి చేను దెబ్బతిన్నట్టు ప్రాథమిక అంచనాల్లో తేలింది. వానల ప్రభావంతో గోదావరి నదీ పరిసర ప్రాంతాల్లోని ఆదిలాబాద్‌‌, ఆసిఫాబాద్​, నిర్మల్‌‌, నిజామాబాద్‌‌, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, వరంగల్‌‌, మహబూబాబాద్‌‌, భద్రాద్రి తదితర జిల్లాల్లో పత్తి పంటపై భారీగా ఎఫెక్ట్‌‌ పడింది. సోయాబీన్‌‌ 3.49 లక్షల ఎకరాల్లో సాగైంది. కంది 5.17 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 4.21 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. మరో 20 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. వర్షాలు, వరదలకు 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనాలున్నయి. రాష్ట్రంలో పంటల బీమా, వాతావరణ ఆధారిత బీమా మూడేండ్లుగా అమలు చేయడం లేదు. దీంతో పంట నష్టానికి పరిహారం అందే చాన్స్​ లేకుండా పోయింది. నష్టం అంచనా వేయడంలో అగ్రికల్చర్​ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు విజయశాంతి.