తెలంగాణ కు రెండో రాజధాని గా వరంగల్ ను తీర్చిదిద్దుతానంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. నిన్న వరంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… పార్టీ అభ్యర్థి గెలుపు కోసం వర్షంలో కూడా వచ్చిన కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. ఇండియా కూటమి అభ్యర్థి గెలుపు కోసం వచ్చిన వామపక్ష కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్పారు.
పౌరుషానికి ప్రతీక అయిన సమ్మక్క సారలమ్మ మనకు ఆదర్శం అన్నారు. కాళోజీ నారాయణరావు, పీవీ నరసింహారావు, తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ జయశంకర్ వరంగల్ గడ్డ వారే.. తెలంగాణ ఉద్యమంలో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు క్రియాశీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు.తులసి వనంలో గంజాయి ఉన్నట్లు ఎర్రబెల్లి, ఆరూరి రమేష్ లాంటి వారు వరంగల్ లో ఉన్నారని ఆగ్రహించారు. భూములు ఎక్కడ కనిపించినా గద్దల్లా వాలి అనకొండ లా మింగేవాళ్లు బీఆర్ఎస్ తరుపున వరంగల్ ను పట్టి పీడుస్తున్నారని నిప్పులు చెరిగారు.