హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈనెల 24వ తేదీన నీటి సరఫరా బంద్ !

-

హైదరాబాద్ మహానగరం వాసులకు… బిగ్ అలర్ట్. ఈనెల 24వ తేదీన తాగునీటి సరఫరాలో అంతరాయం కలగనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాద్ జలమండలి వర్గాలు ప్రకటన కూడా విడుదల చేసింది. కృష్ణ వాటర్ ఫేజ్ 3 పంపింగ్ మెయిన్ లీకేజీ మరమ్మత్తుల పనులు కొనసాగుతున్నాయి. ఈ మనమత్తుల పనులు కొనసాగుతున్న తరుణంలో… నీటి స్వరపరాకు అంతరాయం కలగనుందట.

Water supply shutdown on 24th of this month

దీంతో ఈనెల 24వ తేదీన ఉదయం నుంచి 25వ తేదీ ఉదయం వరకు హైదరాబాద్ నగరంలోని… కొన్ని ప్రాంతాలలో… మంచినీరు రాదని… ఆరోజు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని… జలమండలి ప్రకటన చేసింది. శాస్త్రి పురం, బండ్లగూడ, భోజగుట్ట, షేక్ పేట, ఆళ్ల బండ, జూబ్లీహిల్స్ ఫిలింనగర్, ప్రసవన్ నగర్, తట్టికాన, లాలాపేట, సాహెబ్ నగర్ లాంటి ప్రాంతాలలో మంచినీరు రాదని తెలిపింది. ఆ రోజున ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని వివరించింది జలమండలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version