మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్‌లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణికి అనూహ్య స్పందన లభించిందని.. అర్జిదారుల సమస్యలను పరిష్కరించటానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర దేవాదాయ, అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. ప్రజావాణికి వచ్చిన ప్రతి ఒక్కరి సమస్యను తెలుసుకుని.. వారి అర్జీలను తీసుకున్నారు. ప్రతి అర్జీకి ఒక నెంబర్‌ను కేటాయిస్తున్నట్లు తెలిపారు.
అలాగే అర్జిదారుల రిఫరెన్స్ కోసం వారి సెల్ ఫోన్ నంబర్‌కు మెసేజ్ పంపుతున్నట్లు పేర్కొన్నారు. ప్రజావాణి నిర్వహణను జలమండలి ఎండీ దాన కిశోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ సమన్వయం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఐఏఎస్ అధికారి ముషారఫ్ అలీ, ఆయుష్ డైరెక్టర్ హరిచందన, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ వెంకటేష్ దొత్రి, ఇతర అధికారులు పాల్గొన్నారు.