హిందూ – ముస్లిం అనడమే తప్ప బండి సంజయ్ కరీంనగర్ జిల్లాకు ఏమన్న తెచ్చాడా? – KTR

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో జాతీయ సమైక్యతా దినోత్సవ బహిరంగ సభ లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం, తల్లి తెలంగాణ కోసం అమరుడైన ప్రతి వారిని గుర్తు చేసుకోవాలన్నారు. హైదరాబాద్ పై దండయాత్ర కు కేంద్ర హోం మంత్రి, ఇద్దరు ముఖ్యమంత్రులు వస్తున్నారని.. మతం పేరిట చిచ్చు పెట్టె ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

శత్రు దేశం మీద దాడికి పోయినట్టు తెలంగాణ లో రాజకీయ చిచ్చు పెట్టాలని చూస్తున్నారని.. తెలంగాణ సాయుధ పోరాటములో మీ పాత్ర ఉందా? మీ నాయకుల పాత్ర ఉందా? అని ప్రశ్నించారు. స్వతంత్ర ఉద్యమంలో మా కుటుంబ పాత్ర ఉందని.. మా తాత నిజాం కు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తిగా ఉన్నాడని పేర్కొన్నారు. తెలంగాణ పచ్చగా ఉంటే సహించలేక ఇట్లా వ్యతిరేక సభలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎనిమిది ఏండ్లలో 10 సార్లు వచ్చి ఒక్క రూపాయి అయిన ఇచ్చారా? అని ప్రశ్నించారు. హిందూ ముస్లిం అనడమే తప్ప బండి సంజయ్ కరీంనగర్ జిల్లాకు ఏమన్నా తెచ్చాడా? అన్నారు. బీజేపీ వాళ్ళు అన్ని బోగస్ ముచ్చట్లు, బోగస్ కథలు చెబుతారని మండిపడ్డారు.