బ్లాక్ లిస్ట్ లో పెట్టిన కంపెనీకి నిర్మాణ బాధ్యతలు ఎందుకు కట్టబెట్టారు : కేటీఆర్

-

బ్లాక్ లిస్ట్ లో పెట్టిన కంపెనీ కి ఎందుకు నిర్మాణ బాధ్యతలు కట్టబెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. తాజాగా ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు.  మూసీ ప్రాజెక్ట్ కు టెండర్లు పిలుస్తామని మొన్న సీఎం రేవంత్ రెడ్డి చెప్పాడు. మూసీ మాత్రం ఆఘమేఘాల మీద టెండర్లు అంటున్నడు. రైతులకు అందాల్సిన  రైతు భరోసా, కళ్యాణ లక్ష్మీకి తులం బంగారం లేదు, రైతు బీమా లేదు రైతులను ఇబ్బంది పెడుతుండు. బీఆర్ఎస్ హయాంలో యుద్ధప్రాతిపదికన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేశాం. రైతులకు అందాల్సినవన్ని సకాలంలో అందజేసినట్టు తెలిపారు.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ ఎందుకు ఆలస్యం అవుతుందని ప్రశ్నించారు. ఏ సంస్థను అయితే బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని అధికారులు రిపోర్ట్ ఇచ్చారో ఆ సంస్థకే కాంట్రాక్ట్ ఇచ్చారని తెలిపారు. రూ.1100 కోట్ల గోదావరి నీటిని మూసీ నదిలో నింపవచ్చని కేటీఆర్ పేర్కొన్నారు.  రేవంత్ రెడ్డి బావమరిదికే కాంట్రాక్టు ఇచ్చాడు. ఈస్ట్ ఇండియా కంపెనీకి నిర్మాణ బాధ్యతలు అసలు ఎందుకు ఇచ్చారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జైలుకు ఎప్పుడు పోతావో ఫస్ట్ నువ్వు చూసుకో.. మీ కుటుంబ కంపెనీలకు వేల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చి దండుకో.. వేరే వాల్లు జైలుకు పోవాలా..? అని ప్రశ్నించారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version