నీట్ ఫలితాల్లో మెరిసిన తెలుగు తేజాలు

-

నీట్​ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. తెలంగాణకు చెందిన సిద్ధార్థ రావుకు 711 మార్కులతో జాతీయ స్థాయిలో 5వ ర్యాంకు వచ్చింది. ఏపీ చెందిన సాయికీర్తి తేజ 710 మార్కులతో 12వ ర్యాంక్ సాధించింది. మొదటి 50 ర్యాంకుల్లో తెలుగు విద్యార్థులు 8మంది ఉన్నారు. దివ్యాంగుల్లో తెలంగాణకు చెందిన వాసర్ల జశ్వంత్‌సాయి 661 మార్కులు సాధించి దేశంలో తొలిర్యాంకును పొందాడు. రాజస్థాన్​కు చెందిన తనిష్క జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్​ సాధించింది.

705 మార్కులతో మంగసముద్రం హర్షిత్‌రెడ్డి 36వ ర్యాంకు, అంతే మార్కులతో తెలంగాణకు చెందిన చప్పిడి లక్ష్మి చరిత 37వ ర్యాంకు, కంచన జీవన్‌కుమార్‌రెడ్డి 41వ ర్యాంకు, 700 మార్కులతో వరుం అథితి 50వ ర్యాంకు సొంతం చేసుకున్నారు. దివ్యాంగుల్లో తెలంగాణకు చెందిన వాసర్ల జశ్వంత్‌సాయి 661 మార్కులు సాధించి దేశంలో తొలిర్యాంకును ఆక్రమించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జూటూరి నేహ 695 మార్కులతో ఆల్‌ఇండియాలో 134 ర్యాంకు, ఈడబ్ల్యూఎస్‌ కోటాలో 10వ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఎస్సీ కేటగిరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొమ్ము ఆదర్శ్‌ 685 మార్కులతో జాతీయ స్థాయిలో 7, ఆలిండియార్యాంకు విభాగంలో 453వ స్థానంలో నిలిచారు.

ఎస్టీకోటాలో తెలంగాణకు చెందిన ముదావత్‌ లితేష్‌ చౌహాన్‌ 688 మార్కులతో తొలిస్థానంలో, గుగులోతు శివాని 680 మార్కులతో రెండోస్థానంలో, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వడిత్య తేజశ్విని 675మార్కులతో మూడోస్థానంలో నిలిచారు. వీరికి ఆలిండియా ర్యాంకుల్లో వరుసగా 400, 715, 1,112 దక్కాయి. అలాగే తెలంగాణకు చెందిన లవోద్య బ్రింద 671మార్కులతో 5, అనుమేహ భూక్య 670 మార్కులతో 6వ స్థానంలో నిలిచారు. ఆలిండియా ర్యాంకుల్లో 1374, 1619 దక్కించుకున్నారు. ఓబీసీ కోటాలో ఏపీకి చెందిన గుల్లా హర్షవర్ధన్‌నాయుడు 3వ ర్యాంకు, తెలంగాణకు చెందిన చందల యశశ్విణిశ్రీ 8వ స్థానం సొంతం చేసుకున్నారు. రాష్ట్రాలవారీగా చూస్తే తెలంగాణలో ఎర్రబెల్లి సిద్ధార్థ్‌ రావు, ఆంధ్రప్రదేశ్‌లో మట్టా దుర్గాసాయికీర్తి తేజ తొలిస్థానంలో నిలిచారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version