తెలంగాణ విద్యాశాఖ ముఖ్యకార్యదర్శిగా ఎన్. శ్రీధర్ నియామకం అయ్యారు. డిసెంబర్ 3వ తేదీన టీజీపీఎస్‌సీ చైర్మన్‌గా ఉన్న మహేందర్ రెడ్డి పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే.దీంతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా ఐఏఎస్ క్యాడర్‌కు చెందిన బుర్రా వెంకటేశంను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించగా.. దానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ సైతం ఆమోదం తెలిపారు.
దీంతో ఆయన త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రమంలోనే బుర్రా వెంకటేశం మొన్నటివరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా కొనసాగారు. టీజీపీఎస్సీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టడానికి ముందు బుధవారం ఆయన విద్యాశాఖ కార్యదర్శి పోస్టుకు వీఆర్ఎస్‌కు తీసుకున్నారు. దానికి ప్రభుత్వం నుంచి ఆమోదం లభించింది. దీంతో అతని స్థానంలో విద్యాశాఖ కార్యదర్శిగా ఎన్.శ్రీధర్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ గురువారం రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.